గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (19:52 IST)

ఆరోగ్యంగానే వున్నాను.. భయపడనక్కర్లేదు.. ఉపేంద్ర క్లారిటీ

Upendra
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు చిత్ర పరిశ్రమలో జోరుగా ప్రచారం జరిగింది. బెంగుళూరు, నేలమంగళలోని ఆసుపత్రికి తరలించారు. డస్ట్ అలర్జీ కారణంగా ఉపేంద్రకు శ్వాసకోశ సమస్యలు వచ్చాయి. అతను తన రాబోయే చిత్రం, యాక్షన్ సన్నివేశాల షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు అతని పరిస్థితి మరింత దిగజారింది.
 
మరోవైపు ఈ విషయంపై ఉపేంద్ర స్పందిస్తూ ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడారు. తాను బాగానే ఉన్నానని, తన రాబోయే చిత్రం UI షూటింగ్‌ను కొనసాగిస్తున్నానని స్పష్టం చేశారు. 
 
ఉపేంద్ర ఫేస్‌బుక్‌లో మాట్లాడుతూ, "ప్రస్తుతం నేను స్టూడియోలో ఉన్నాను. అందరూ ఇక్కడ ఉన్నారు చూడండి, మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌తో సహా అందరూ ఇక్కడ ఉన్నారు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, కొంచెం దుమ్ము ఎక్కువైంది, దగ్గు మాత్రమే. అదే వార్త. దయచేసి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దు. ప్రస్తుతం షూటింగ్‌ కొనసాగిస్తున్నాం.
 
ఉపేంద్రకు డస్ట్ ఎలర్జీ అని తెలిసి.. వెంటనే స్టూడియోకి డాక్టర్‌ను పిలిపించి చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత, నటుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఐపై షూటింగ్ కోసం సురక్షితంగా స్టూడియోకి తిరిగి చేరుకున్నారు.