శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 4 జూన్ 2017 (13:48 IST)

రంగీలా మళ్ళీ వచ్చేస్తోంది.. ఐటెంసాంగ్‌తో రీ ఎంట్రీ..

రంగీలాతో ఓ ఊపు ఊపేసిన ఊర్మిళ.. మళ్లీ హాట్ సాంగ్ చేసేందుకు రెడీ అవుతోంది. తెలుగులో అంతం, గాయం, అనగనగా ఒకరోజు లాంటి సినిమా చేసింది. ఆ తర్వాత రంగీలాతో బాలీవుడ్‌లో సెటిలైపోయిన ఊర్మిళ, గ్లామర్‌తో పాటు పెర్

రంగీలాతో ఓ ఊపు ఊపేసిన ఊర్మిళ.. మళ్లీ హాట్ సాంగ్ చేసేందుకు రెడీ అవుతోంది. తెలుగులో అంతం, గాయం, అనగనగా ఒకరోజు లాంటి సినిమా చేసింది. ఆ తర్వాత రంగీలాతో బాలీవుడ్‌లో సెటిలైపోయిన ఊర్మిళ, గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసింది. గత ఏడాది వివాహం చేసుకుని వెండితెరకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఐటెంసాంగ్‌తో బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వబోతోందట ఊర్మిళ. 
 
టీ- సిరీస్ ఆర్డీపీ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న 'రైతా'లో హంగామా చేయనుంది. అభినయ్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా 43 ఏళ్ల వయసులో ఊర్మిళ రీ ఎంట్రీ ఇస్త్తూ స్పెషల్ సాంగ్ చేయడం బాగానే వర్కవుట్ అవుతుందని సినీ యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. తమ మూవీకి ఊర్మిళ పాటే హైలైట్ అవుతుందని వారు చెప్తున్నారు.