కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)
అసలే ఎండాకాలం. గొంతు తడారిపోతుంది. చెమటతో వళ్లు తడిసిపోతుంది. ఎండ వేడిమి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మనుషులకైతే శీతల పానీయాలు దొరుకుతాయి. వాటితో వేసవి తాపాన్ని తీర్చుకుంటారు. మరి మూగజీవాల పరిస్థితి ఏంటి?
ఈ వేసవి ఉష్ణోగ్రతలో మూగజీవాల పట్ల దయ చూపుతూ వాటికి పుల్ల ఐస్ క్రీములను అందిస్తోంది ఓ మహిళ. వాటిని చల్లచల్లగా సేవిస్తూ వాటికోసం కొండముచ్చులు ఎగబడ్డాయి. కావలసినది దొరకగానే చక్కగా పక్కనే కూర్చుని వాటిని ఆరగించాయి. చూడండి ఆ వీడియో...