సోమవారం, 17 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 17 మార్చి 2025 (10:27 IST)

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ టైటిల్ ప్రదీప్ మాచిరాజు కు కలిసివస్తుందా !

Pradeep Machiraju, Deepika Pilli
Pradeep Machiraju, Deepika Pilli
యాంకర్ టు నటుడిగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా పరిచయమైన ప్రదీప్ మాచిరాజు తన రెండో సినిమాకు కొంత గేప్ తీసుకున్నారు. అప్పట్లో షూటింగ్ చేస్తుండగా ఆయన కాలుకు గాయమైంది కూడా. ఇక ఇప్పుడు తన సెకండ్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' తో వస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ పెట్టుకున్న మాచిరాజుకు ఈ సినిమా కలిసివస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో పవన్ గురించి ప్రస్తావన వుంటుందో లేదో కానీ, యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తీర్చిదిద్దతుున్నారు.
 
 ఇద్దరు డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. మేకర్స్ ఈ చిత్రం విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈ సినిమా వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో సినిమా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో ప్రదీప్, దీపిక పిల్లిని ఒక రౌడీ గ్యాంగ్ వెంబడిస్తున్నట్లు కనిపిస్తోంది.
 
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎన్ బాలరెడ్డి కెమెరా మ్యాన్ గా పని చేస్తన్నారు, కోదాటి పవనకల్యాణ్ ఎడిటర్. సందీప్ బొల్లా కథ, డైలాగ్స్ అందించగా, ఆశిస్తేజ పులాల ప్రొడక్షన్ డిజైనర్.