బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (16:22 IST)

మీరా చోప్రాకు బెదిరింపులు... హైదరాబాద్‌లో ఎఫ్ఐఆర్

హీరోయిన్ మీరా చోప్రాకు వచ్చిన బెదిరింపులకు సంబంధించి హైదరాబాద్ నగర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె జాతీయ మహిళా కమిషన్‌కు చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నగర పోలీసులు స్పందించించారు. 
 
లాక్డౌన్ వేళ ఆమె తన అభిమానులతో సోషల్ మీడియాలో చాట్ చేస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ కంటే మహేష్ బాబునే ఎక్కువ ఇష్టపడతానని వ్యాఖ్యానించింది. ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. దీంతో ఆమెను దూషిస్తూ, అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారు. మరికొందరు అయితే, రేప్ చేస్తామనీ, మీ తల్లిదండ్రులను చంపేస్తామంటూ బెదిరించారు. 
 
వీటిపై మీరా చోప్రా స్పందిస్తూ, ఈ విషయంలో స్పందించాలంటూ జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. దాంతో అభిమానులు మరింత రెచ్చిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో తనను దూషించడంతో పాటు, అత్యాచారం చేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ మీరా చోప్రా జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది.
 
దీనిపై స్పందించిన కమిషన్... మీరా చోప్రా విషయంలో జోక్యం చేసుకోవాలంటూ హైదరాబాద్ పోలీస్‌ను కోరింది. ఈ నేపథ్యంలో, సైబర్ క్రైమ్ పోలీసులు సెక్షన్ 509, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎమ్ ప్రసాద్ మాట్లాడుతూ, దాదాపు 8 మందిని ఆమెను ట్రోల్ చేశారని, అభ్యంతరకర కామెంట్లు పోస్టు చేసిన వెంటనే ఆయా ట్విట్టర్ ఖాతాలు డీయాక్టివేట్ అయినట్టు గుర్తించామని వెల్లడించారు.