సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (13:01 IST)

కామెడీ కింగ్ వడివేలుకు బర్త్ డే వేడుకలు.. సీఎం తనయుడి సమక్షంలో

Vadivelu
టాలీవుడ్‌లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందానికి ఎంతగా క్రేజ్ ఉందో కామెడీ కింగ్‌గా వడివేలుకు అంతక్రేజ్ వుంటుంది. కొన్ని కారణాల వల్ల దాదాపు పది సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న వడివేలు మళ్ళీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
 
తాజాగా ఆయన తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిది స్టాలిన్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఏకధాటిగా జరిగిన షూటింగ్ కార్యక్రమాలతో తాజాగా చిత్రీకరణ పూర్తి అయింది.
 
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియాలో సందడి చేశారు. అదే సమయంలో వడివేలు పుట్టిన రోజు కావడంతో సెట్ లోనే ఆయన బర్త్‌ డే వేడుకను ఉదయనిది స్టాలిన్ చేయించారు. 
 
బర్త్‌ డే కార్యక్రమంలో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా పాల్గొని వడివేలుకి శుభాకాంక్షలు తెలియజేశారు. చాలాకాలం తర్వాత షూటింగ్ సందర్భంగా బర్త్‌ డే చేసుకున్నట్లు వడివేలు చెప్పుకొచ్చాడు.