గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (18:06 IST)

వైష్ణవ్ తేజ్‌ని ఐదు నిముషాల‌కే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందిః ద‌ర్శ‌కుడు క్రిష్‌

Konda polem prerelease
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `కొండపొలం`. క్రిష్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.   ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైద‌రాబాద్‌లో  ఏర్పాటు చేశారు. 
 
చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో రెండు పాటలు రాశాను. `హరిహర వీరమల్లు`తో పని చేస్తున్న సమయంలోనే కొండపొలం అవకాశం వచ్చింది. సన్నపురెడ్డి వెంకటరెడ్డి కొండపొలం అద్భుతంగా రచించారు. చ‌క్కటి కథనాన్ని అందించారు. అడవి గురించి మూడు నిమిషాల పాట రాశాను. అడవిని తల్లి ఒడి, గుడి, బడి అనే కోణాల్లోంచి చూసి రాశాను. చెట్టెక్కి అనే పాట కూడా రాశాను. ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు కీరవాణి, క్రిష్ గారికి థ్యాంక్స్’ అని అన్నారు.
 
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, ‘సినిమా చూసేందుకు నేను కూడా నిరీక్షిస్తున్నాను. నేను కొందరినీ చూసి ఊహించుకుని నవల రాశాను. వాటిని క్రిష్ తెరపై ఎలా చూపించాడా? అని ఎదురుచూస్తున్నాను. నేను కూడా అక్టోబర్ 8న సినిమా చూసేందుకు ఆత్రుతగా ఎదరుచూస్తున్నాను’ అని అన్నారు.
 
సాయి చంద్ మాట్లాడుతూ, సినిమాలో నటించిన నటుడిగా ఇక్కడకు రాలేదు. ఓ తండ్రిగా వచ్చాను. ఉప్పెన సినిమాలో పాత్రను చేయమని చిరంజీవి గారు చెప్పారు. ఒక వేళ ఆయన చెప్పినట్టు చేయకపోతే.. ఓ మంచి కొడుకును మిస్ చేసుకునే వాడిని. ఈ జనరేషన్‌లో ఇంత మంచి వాడు ఉండటం చాలా సంతోషం. ఉప్పెనతో తండ్రి పాత్రకు ఇంకా తనివితీరలేదని అనుకున్నాను. మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుందని అంటారు. అలా అప్పుడు క్రిష్ నుంచి ఫోన్ వచ్చింది. కొండపొలం కథను సినిమాగా చేస్తున్నామని చెప్పారు. తండ్రి పాత్ర అని చెప్పడంతో ఎంతో సంతోషించాను. వైష్ణవ్ తేజ్ నన్ను ఎంతో బాగా చూసుకున్నాడు’ అని అన్నారు.
 
హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల అని ఈ సినిమా పోస్టర్లో వేయడం నాకు నచ్చింది. నవలు రాసే వారు కాదు.. చదివే వారు తగ్గారు. చలం మైదానం లాంటి సినిమాలు తీయాలని వచ్చాను. ఎకనామిక్స్, ఈస్థటిక్స్ కలిపి సినిమాలు తీయడం మామూలు విషయం కాదు. కానీ క్రిష్ దాన్ని అవలీలగా దాటేశారు. చంద్రబోస్ అద్భుతంగా పాట రాశారు. బతుకును కొరికే ఆకలి కేకలు అని లైన్ బాగా రాశారు. ఓబులమ్మ పాటను చూసినప్పటి నుంచి రకుల్‌ను ఆ పాత్రలో చూస్తున్నాను. ఎంతో గొప్పగా క్యారెక్టర్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయింది. ఇది గొప్ప చిత్రం. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఇంకా మంచి నవలను రాయాలి. దాన్ని మేం సినిమాగా తీసేందుకు రెడీగా ఉంటాం. అడవిని మళ్లీ మన ఇంటికి తీసుకొస్తున్నందుకు క్రిష్‌కు థ్యాంక్స్’ అని అన్నారు.
 
క్రిష్ మాట్లాడుతూ, మళ్లీ సినిమా కోసం సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారితో కథను రాయించాను. స్క్రీన్ ప్లే మాత్రమే నేను రాశాను. మహేష్ విట్టా చెప్పినట్టుగా వైష్ణవ్ తేజ్‌ను కలిసిన ఐదు నిమిషాలకే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నేను హగ్ చేసుకుని భుజం మీద ముద్దు పెట్టేశాను. ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్‌కు బెంచ్ మార్క్ క్రియేట్ అయింది. అంతకంటే పై మెట్టు ఎక్కిస్తున్నాను. అలాంటి కథ, పాత్ర దొరికింది. ఓబులమ్మగా నటించిన రకుల్ గురించి చెప్పాలి. రకుల్ అంటే అందమైన అమ్మాయి, వర్కవుట్లు అని అంటారు. కానీ ఆమె లోలోపల వేరే ఉంది. క్రమశిక్షణ, అంకితభావం, డైలాగ్స్ నేర్చుకునే తీరు, ఆ యాసతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది మ‌నంద‌రం గర్వపడే సినిమా. ఎంజాయ్ చేసే చిత్రం. సినిమాను బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
 
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, నాకు ఈ పాత్రను పోషించడంలో సంతృప్తి దొరికింది. నాకు ఈ పాత్ర ఎంతగా నచ్చిందో.. ప్రేక్షకులకు కూడా అంతే నచ్చుతుందని అనుకుంటున్నాను. వైష్ణవ్ తేజ్ కళ్లు చాలా పవర్ ఫుల్. ఎంతో ఒదిగా ఉంటాడు. అక్టోబర్ 8న అందరూ ఈ సినిమాను చూడండి’ అని అన్నారు.
 
వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. ‘అడవి పెద్దబాలశిక్ష అంటారు. ఉప్పెన నా మొదటి చాప్టర్ అయితే.. కొండపొలం రెండోది. ఈ చిత్రంలో ఎంతో మంది దగ్గరి నుంచి ఎన్నెన్నో నేర్చుకున్నారు. అందరినీ గమనిస్తూ కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్ని నేర్చుకున్నాను. రాజీవ్, క్రిష్, సాయి బాబా గారు ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడుతూ ఉంటారు. ఒకరినొకరు ఏం చెప్పుకోకుండానే.. అన్ని తెలిసిపోతాయి. ఆ ముగ్గురి స్నేహబంధం చాలా గొప్పది. క్రిష్ అన్న దగ్గరి నుంచి ఎన్నో నేర్చుకున్నాను. సినిమాను సాధారణ పరిస్థితుల్లో చేయలేదు. టీం అంతా కలిసి కెమెరాలు ఎత్తుకుంటూ అడవిలోకి వెళ్లాం. మా టీం అందరి కష్టమే కొండపొలం. ఈ క్యారెక్టర్ మనలో ఒకడు. మనకు ఎన్నో భయాలు ఉంటాయి. మూవీ ముందుకు వెళ్లే కొద్ది భయాలను ఎదుర్కొంటూ వెళ్తాడు. ఎన్నో కష్టాలు పడి.. పులిని ఎదురించడమే ఈ కొండపొలం. ఓ స్టెప్ వేస్తే పడిపోతామనే భయం ఉంటుంది. కానీ ఎన్ని సార్లు పడ్డా కూడా ముందుకు వెళ్లాలనే బలాన్ని కొండపొలం ఇస్తుంది. మీరు ఈ దేశాన్ని గర్వపడేలా చేయాలని ఆలోచనను మీలో రేకెత్తిస్తుంది. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు క్రిష్ గారికి థ్యాంక్స్’ అని అన్నారు.
 
హేమ మాట్లాడుతూ.. ‘మెగా ఫ్యామిలీలో అందరితో సినిమాలు చేశాను. ఒక్క వరుణ్ తేజ్‌తోనే ఇంకా చేయలేదు. ఎంతో  సహజంగా నటిస్తావు అని పవన్ కళ్యాణ్ అన్నారు. చిరంజీవి సినిమాల్లో అత్తగారి పాత్ర వేశాను. సాయి ధరమ్ తేజ్‌ మొదటి సినిమాలో అమ్మ పాత్రను వేశాను. ఎక్కడ కలిసిన అమ్మా అని పిలుస్తుంటాడు. ఆయన త్వరగా కోలుకోవాలి. వైష్ణవ్ తేజ్ నా తమ్ముడు. మొదటి రోజు నుంచి అక్కా అని పిలిచేవాడు. వైష్ణవ్ డైలాగ్స్ చెబితే మాత్రం మామూలుగా ఉండదు. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు క్రిష్ గారికి థ్యాంక్స్. రకుల్‌ది టైం అంటే టైం. సినిమా కోసం చాలా కష్టపడింది. గమ్యం, వేదం కంటే ఎక్కువ కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాలి’ అని అన్నారు.