శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 మార్చి 2017 (12:10 IST)

జయరాం, సముద్రగని సినిమా నుంచి వరలక్ష్మి అవుట్.. ఆ నిర్మాతకు సభ్యత, సంస్కారం లేదట..!

తమిళంలో విజయం సాధించిన 'అప్పా' అనే సినిమాను మలయాళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో జయరాం హీరోగా నటిస్తుండగా, సముద్రగని దర్శకత్వం వహిస్తున్నారు. జయరాంకు జోడీగా వరలక్ష్మి నటిస్తోంది. మూడు రోజుల క్రితం

సినీ నటి భావన కిడ్నాప్‌, లైంగిక వేధింపు ఘటనతో యావత్‌ సినీ ప్రపంచం ఉలిక్కి పడింది. ఈ ఘటనకి సంబంధించి మల్లూవుడ్‌ అంతా భావనకు అండగా నిలిచింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌ పరిశ్రమ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సానుభూతి తెలియజేస్తూ బాసటగా నిలిచారు. ఈ ఘటనపై తమిళ నటి, శరత్ కుమార్ తనయ వరలక్ష్మి కూడా ఈ రకంగా లైంగిక వేధింపులకు గురి అయ్యిందని చెప్పింది. 
 
సినీ ఇండస్ట్రీలో బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న అలాంటి వారికే ఇలాంటి వేధింపులు తప్పలేదు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి. మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని వరలక్ష్మి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా వరలక్ష్మి తన సినీ కెరీర్‌పై స్పందించిది. ఇంకా సినీ పరిశ్రమలో నెలకొన్న అసభ్యతపై వరమ్మ మళ్లీ నోరు విప్పింది. 
 
తమిళంలో విజయం సాధించిన 'అప్పా' అనే సినిమాను మలయాళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో జయరాం హీరోగా నటిస్తుండగా, సముద్రగని దర్శకత్వం వహిస్తున్నారు. జయరాంకు జోడీగా వరలక్ష్మి నటిస్తోంది. మూడు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వరలక్ష్మి కూడా హాజరైంది. కానీ, ఇంతలోనే ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె ప్రకటించింది.
 
ఈ సినిమా నిర్మాతలతో తాను పని చేయలేనని వరలక్ష్మి తేల్చి చెప్పేసింది. సభ్యత, సంస్కారం లేని వారితో తాను పని చేయనని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నానని తెలిపింది. అయితే జయరాం, సముద్రగనిలతో కలసి భవిష్యత్తులో తప్పకుండా పని చేస్తానని క్లారిటీ ఇచ్చేసింది. అయితే నిర్మాతకు, వరలక్ష్మికి ఏమైందని ప్రస్తుతం చర్చ సాగుతోంది.