1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 17 జులై 2016 (14:43 IST)

చెప్పాపెట్టకుండా పరిణీతికి ముద్దుపెట్టేసిన వరుణ్.. అందరికీ షాక్!

షూటింగ్ జరుగుతుంది. ముద్దుపెట్టుకునే సీన్ లేనే లేదు. పాట కోసం స్టెప్పులేస్తున్నారు. ఉన్నట్టుండి పాట చివర్లో డ్యాన్స్ మూవ్‌మెంట్ కంప్లీట్ కాగానే ముద్దు పెట్టాసాడు ఓ బాలీవుడ్ హీరో. ఇంతకీ ఇదెక్కడ జరిగింద

షూటింగ్ జరుగుతుంది. ముద్దుపెట్టుకునే సీన్ లేనే లేదు. పాట కోసం స్టెప్పులేస్తున్నారు. ఉన్నట్టుండి పాట చివర్లో డ్యాన్స్ మూవ్‌మెంట్ కంప్లీట్ కాగానే ముద్దు పెట్టాసాడు ఓ బాలీవుడ్ హీరో. ఇంతకీ ఇదెక్కడ జరిగిందంటే.. బాలీవుడ్‌లో డిష్యూం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి జాన్ మాన్ హా అనే సాంగ్ షూటింగ్ జరుగుతుండగా, హీరో తానై తానుగా నిర్ణయించుకొని హీరోయిన్‌కు కిస్ ఇచ్చేశాడు. 
 
దాంతో సెట్స్‌లో ఉన్నవారంతా షాక్ అయ్యారు. అయితే ఇలా ముద్దు పెట్టమని దర్శకుడు వారికి చెప్పలేదట. అయితే దీనిపై హీరోయిన్ పరిణితి చోప్రా వివరణ ఇచ్చింది. ఈ పాటకు చివర్లో ముద్దు పెడితే ఇంకా కిక్ వస్తుందని హీరో వరుణ్ చెప్పాడంది. అంతేగాకుండా గోవిందా, కరీష్మా కపూర్ నటించిన ఓ సినిమాలో సాంగ్ ఎండింగ్‌లో ముద్దు పెట్టుకునే సన్నివేశం ఉండేదని, మనము అలా చేస్తే బాగుంటుందని వరుణ్ చెప్పాడని.. అందుకు తానూ ఓకే చెప్పేసానని పరిణీతి చోప్రా వెల్లడించింది. అందుకే పాట చివర్లో వరుణ్ చెప్పా పెట్టకుండా ముద్దెట్టేశాడని పరిణీతి చెప్పింది. అదన్నమాట సంగతి..!