బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 10 మే 2024 (17:00 IST)

అమయాకంగా ఉండే వరుణ్ సందేశ్ వెనుక ముసుగు వ్యక్తి ఎవరు? నింద ఫస్ట్ లుక్ పోస్టర్

Varun Sandesh Ninda first look
Varun Sandesh Ninda first look
వరుణ్ సందేశ్ ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్నారు. ఇప్పుడు ఆడియెన్స్ రెగ్యులర్ సినిమాల కంటే కంటెంట్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో వరుణ్ సందేశ్ ‘నింద’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ అనే చిత్రాన్ని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహిస్తున్నారు.
 
ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీ టైటిల్ లోగో, పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ చిత్రం రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. వరుణ్ సందేశ్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే వరుణ్ సందేశ్ అమయాకంగా కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఓ ముసుగు వ్యక్తి రూపం కనిపిస్తోంది. ఇక ఈ పోస్టర్‌ను రివర్స్ చేసి చూస్తే న్యాయదేవత విగ్రహం, ముసుగు వ్యక్తి రూపం కూడా కనిపిస్తోంది.  మరి ఈ ముసుగు వ్యక్తి ఎవరు? న్యాయ దేవతను ఎందుకు చూపిస్తున్నారు? వరుణ్ సందేశ్ కారెక్టర్ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా ఈ పోస్టర్ ఉంది. 
 
ఇలా పోస్టర్‌తోనే అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించారు. ఇక ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 15న ఈ చిత్రం నుంచి టీజర్‌ను కూడా విడుదల చేయబోతున్నారు. 
 
నటీనటులు : వరుణ్ సందేశ్, ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్దార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ్ కృష్ణ, రాజ్ కుమార్ కుర్రా, దుర్గా అభిషేక్ తదితరలు