దమ్మున్న గ్యాంగ్‌స్టర్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలకు సిద్ధం
Gangster Lankala ratna
విశ్వక్ సేన్ కూడా ఈ సినిమాపై ఇదే విధమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని నమ్ముతున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ ఆల్బమ్‌లోని "సుట్టంలా సూసి" అనే మెలోడియస్ సాంగ్ ఇప్పటికే వైరల్‌గా మారింది. మే 10వ తేదీన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థీమ్ సాంగ్ "బ్యాడ్ "ని చిత్ర బృందం విడుదల చేసింది.
ఇక ఇటీవల విడుదలైన టీజర్‌తో, మేకర్స్ లంకల రత్న పాత్ర ఎలా ఉండనుంది? అతని ప్రపంచం ఎలా ఉండనుంది? అనే స్పష్టత ఇచ్చేశారు మేకర్స్. ఈ టీజర్ సినీ ప్రేమికులను ఆకర్షించింది. ఈ టీజర్ తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో, ప్రముఖ నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిత్ మదాడి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాకి కృష్ణ చైతన్య కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
