1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2023 (16:42 IST)

గ్లామర్ పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న హీరోయిన్‌గా నేహా శెట్టి

Neha Shetty
Neha Shetty
అందంతో పాటు తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది యంగ్ హీరోయిన్ నేహాశెట్టి. "డీజే టిల్లు" సినిమాతో టాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో రాధికగా నేహా శెట్టి పర్ ఫార్మెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. "డీజే టిల్లు" సక్సెస్ ను తన తర్వాత సినిమాలు "బెదురులంక 2012", "రూల్స్ రంజన్"తో కొనసాగించింది నేహా శెట్టి. రూల్స్ రంజన్ సినిమాలో సమ్మోహనుడా సాంగ్ ఛాట్ బస్టర్ అయ్యింది. నేహా శెట్టి డ్యాన్సింగ్ టాలెంట్ చూపించిందీ పాట. 
 
తెలుగులో చేసిన మూడు సినిమాలు వరుసగా హిట్ కావడంతో నేహా శెట్టి మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా ఎదిగింది. అందుకే గ్లామర్ ఫ్లస్ పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న హీరోయిన్ కావాలనుకునే హీరోస్, డైరెక్టర్స్ నేహా శెట్టినే ప్రిఫర్ చేస్తున్నారు.  హీరో విశ్వక్ సేన్ తో కలిసి నేహా శెట్టి నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఆడియెన్స్ నుంచి దక్కుతున్న ఆదరణ, టాలీవుడ్ తనపై పెట్టుకున్న నమ్మకంతో క్రేజీ లైనప్ చేసుకుంటోంది నేహా శెట్టి.