సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2023 (11:24 IST)

టిల్లు స్క్వేర్‌కు బ్రేకులు.. సిద్ధు జొన్నలగడ్డదే నిర్ణయం

Tillu sequel
Tillu sequel
టిల్లు స్క్వేర్ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ , అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్నారు. ఈ సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి రామ్‌ మల్లిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "DJ టిల్లు" ఈ సంవత్సరంలో సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 
 
"టిల్లు స్క్వేర్" అనేది ఈ సినిమాకు సీక్వెల్ అని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ నత్తనడకన నడుస్తోంది. అయితే చాలాకాలం పాటు ఆగిపోయిన షూటింగ్ ఇటీవలే పునఃప్రారంభమైంది. 
 
ఈ సినిమాపై ప్రేక్షకుల మధ్య భారీ అంచనాలున్న నేపథ్యంలో స్క్రీన్ ప్లే విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడట సిద్ధు జొన్నలగడ్డ. సినిమాలో కొన్ని కరెక్షన్స్ చేస్తున్నాడట. ఇకపోతే ఈ చిత్రం ఏడాది మాత్రమే థియేటర్లలో విడుదల అవుతుంది.