బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

సాయి పల్లవి నటనకు ప్రవాసీలు 'ఫిదా'.. కలెక్షన్ల వర్షం...

భానుమతిగా తెలంగాణ యాసలో సాయి పల్లవి నటనకు తెలుగు వారే కాదు.. ప్రవాసీలు కూడా 'ఫిదా' అయిపోయారు. ఫలితంగా ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటి

భానుమతిగా తెలంగాణ యాసలో సాయి పల్లవి నటనకు తెలుగు వారే కాదు.. ప్రవాసీలు కూడా 'ఫిదా' అయిపోయారు. ఫలితంగా ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'ఫిదా'. ఇది గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా కలెక్షన్లపరంగా దుమ్మురేపుతోంది. ముఖ్యంగా, అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా ఓ రోజు ముందుగానే విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
 
వరుణ్ తేజ్ గత చిత్రాలైన 'ముకుంద', 'కంచె', 'లోఫర్' సినిమాలు ఓవర్సీస్‌లో ఓ మోస్తరుగా ఆడినా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు మాత్రం రాలేదు. కానీ ఆయా సినిమాల ఓవరాల్ కలెక్షన్లను 'ఫిదా'.. కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టినట్టు ఫిల్మ్ ట్రేడ్ వర్గాల సమాచారం. 
 
ప్రీమియర్స్ ద్వారా గురువారం 3,63,325 డాలర్లు కలెక్ట్ చేయగా ఆ తర్వాత శుక్ర, శనివారాల్లో మొత్తం కలిపి 7,13,325 డాలర్లను కొల్లగొట్టినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే వరుణ్ తేజ్.. గత సినిమాల ఓవరాల్ కలెక్షన్లను ఫిదా దాటేయడంతో చిత్ర నిర్మాతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. భానుమతిగా తెలంగాణ యాసలో సాయి పల్లవి నటనకు తెలుగు వారే కాదు.. ప్రవాసులు కూడా ఫిదా అయ్యారని, అందుకే ఈ చిత్రాన్ని చూసేందుకు ఎన్నారై ప్రేక్షకులు క్యూ కడుతున్నారనీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.