శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 6 ఏప్రియల్ 2019 (20:36 IST)

వెంకీ మామ టైటిల్ లోగోలో ఉన్న సీక్రెట్ ఇదే..!

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్యల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందుతోన్న ప్రెస్టేజీయ‌స్ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ‌. ఈ భారీ చిత్రానికి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాజ‌మండ్రిలో ఫ‌స్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ నెల 8 నుంచి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయ‌నున్నారు. హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న ఈ షెడ్యూల్లో వెంక‌టేష్, నాగ చైత‌న్యల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఉగాది పండ‌గ సంద‌ర్భంగా వెంకీ మామ టీమ్ టైటిల్ లోగోను రిలీజ్ చేసారు. 
 
ఇక లోగోలో క‌థ‌ను చెప్పారు. లోగోలోనే క‌థను చెప్పారా..? ఇంత‌కీ ఏంటి క‌థ అనుకుంటున్నారా..? వెంక‌టేష్ ప‌ల్లెటూరులో ఉండే కిసాన్ అయితే... నాగ చైత‌న్య దేశాన్ని కాపాడే జ‌వాన్ పాత్ర పోషిస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అవ‌న్నీ నిజ‌మే అని లోగోను చూస్తే తెలుస్తుంది. ఈ లోగో ద్వారా తెలిసిన మ‌రో విష‌యం ఏంటంటే... టైటిల్ చుట్టూ 12 రాశులు ఉన్నాయి. 
 
అంటే... జాత‌కాలు ఈ క‌థ‌లో కీల‌క పాత్ర పోషిస్తాయి అనిపిస్తుంది. రాశి చక్రంలో వెంకీ అనేది ఆంగ్ల అక్షరాలతో.. మామ అనేది తెలుగు అక్షరాల్లో డిజైన్ చేశారు. ఇలా లోగో డిజైన్ చాలా డిఫ‌రెంట్‌గా ఉండి విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. మ‌రి... కామెడీతో పాటు యాక్ష‌న్ కూడా ఉండే ఈ సినిమా ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నుందో చూడాలి.