శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 20 మార్చి 2019 (22:43 IST)

వెంకీ మామ ఎంత వ‌ర‌కు వ‌చ్చాడు..?

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం వెంకీ మామ‌. ఈ చిత్రానికి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇటీవ‌ల ఈ సినిమాని రాజ‌మండ్రి స‌మీపంలో ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో వెంకీ కి జోడిగా పాయల్ రాజ్ పుత్ న‌టిస్తుంటే... నాగ చైతన్యకు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది.
 
అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనెర్‌గా అంద‌రికీ న‌చ్చేలా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో వెంకీ రైస్ మిల్లర్ ఓనర్‌గా నటిస్తుండగా చైతూ మిలిటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ నుంచి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయ‌నున్నారు. ద‌స‌రా కానుక‌గా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
ప్రేమ‌మ్ సినిమాలో వెంకీ, చైతు క‌లిసి ఒక సీన్లో క‌నిపిస్తేనే ఫ్యాన్స్ తెగ సంబ‌ర‌ప‌డిపోయారు. అలాంటిది ఇక సినిమా అంతా మేన‌మామ మేన‌ల్లుడు వెంకీ, చైతు క‌లిసి న‌టిస్తే... ఇక అక్కినేని, ద‌గ్గుబాటి పండ‌గే..!