గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జనవరి 2024 (16:08 IST)

ప్రముఖ బెంగాలీ హీరోయిన్ శ్రీల కన్నుమూత

sreela majumdar
బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ హీరోయిన్ శ్రీల మజుందర్ అనారోగ్యంతో మృతి చెందారు. 1958లో జన్మించిన ఈమె... 1980లో మృణాల్ సేన్ దర్శకత్వంలో వచ్చిన 'పరశురామ్' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'ఏక్ దిన్ ప్రతిదిన్', 'ఖర్జీ', 'అరోహన్' వంటి అనే విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వచ్చారు. నసీరుద్దీన్ షా, షబానా ఆజమీ, సమితా పటేల్ వంటి దిగ్గజ దర్శకుల చిత్రాల్లో నటించిన శ్రీల మజుందర్ మృతిపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. 
 
"సినీ నటి శ్రీల మరణవార్త విని షాక్‌కు గురయ్యాను. ఆమె ఎన్నో అద్భుతమైన పాత్రల్లో చక్కగా నటించి, పవర్‌ఫుల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగాల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆమె లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఆమె అసామాన్యమైన నటన ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈమె నటించిన చివరి చిత్రం "పలన్". 2023లో విడుదలైంది. అలాగే, 2003లో వచ్చిన "చోకర్ బలీ" చిత్రంలో ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌కు ఆమె డబ్బింగ్ చెప్పారు.