గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (13:56 IST)

కడపలో సందడి చేసిన సూపర్‌స్టార్ రజినీకాంత్

rajini - fahad
సూపర్ స్టార్ రజినీకాంత్ ఏపీలోని కడపలో సందడి చేశారు. ఆయన నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇక్కడ జరిగింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న నాపరాయి క్వారీలో "వేట్టయన్" మూవీ షూటింగ్ సాగుతుంది. అందులోభాగంగా రజినీకాంత్ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను ఈ క్వారీలో చిత్రీకరించారు. 
 
ఈ షూటింగ్ కోసం చెన్నై నుంచి కడప చేరకున్నారు. షూటింగ్ నిమిత్తం జమ్మలమడుకు వచ్చిన తలైవాను చూడటానికి భారీ ఎత్తున జనం లొకేషన్‌కు తరలివచ్చారు. సూపర్ స్టార్ వచ్చారన్న వార్త చుట్టు ప్రక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో కాస్త దూర ప్రాంతాల నుంచి కూడా ఆయన అభిమానులు షూటింగ్ స్పాట్‌కు వచ్చారు. 
 
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 170వ సినిమా వెట్టయన్‌కు సంబంధించి యాక్షన్స్ సీన్స్‌ను ఇక్కడ షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జమ్మలమడుగు ప్రాంతం నాపరాయి గనులకు ప్రసిద్ది. ఇక్కడ ఎర్రగుంట్ల ప్రాంతంలోని నాపరాయిగనిలో ఈ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. 
 
దర్శకుడు టీజే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రజనీకాంత్ తన 170 సినిమాను చేస్తున్నారు. మంగళవారం సినిమాకు సంబంధించిన రిహార్సల్స్‌ను అలాగే బుధవారం సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్లు చిత్రీకరించినట్లు సమాచారం.