విజయ్ దేవరకొండ వెరీ హాట్ గురూ- సారా అలీఖాన్
అమృత సింగ్, సైఫ్ అలీ ఖాన్ దంపతుల కుమార్తె సారా అలీఖాన్. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను ఆవిష్కరించింది. రణ్ వీర్ సింగ్ పెద్ద ఫ్యాన్ అని చెబుతోంది. 'కేదర్‌నాధ్' అనే సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది సారా.. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన 'సింబా'లో రణ్ వీర్ సింగ్‌తో నటించి మంచి విజయాన్ని అందుకుంది. అందుకే రణవీర్‌పై అభిమానాన్ని పెంచుకుంది.
దక్షిణాదిలో ధనుష్‌తో కూడా నటిస్తోంది. ఒకేసారి ధనుష్, అక్షయ్ డిన్నర్‌కు పిలిస్తే ఎవరిని ప్రిఫర్ చేస్తారన్న ప్రశ్నకు - చాలా రొమాంటిక్‌గా సమాధాన ఇచ్చింది. ఇద్దరీనీ ప్రిఫర్ చేస్తాను. అందులో తప్పేముంది .అక్షయ్‌తో పరోటా, ధనుష్‌తో దోసె కలిసి తింటామని ఆనందంగా చెప్పుకొచ్చింది.
పౌత్‌లో ధనుష్ కాకుండా ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది అన్న ప్రశ్నకు.. తడుముకోకుండా ఇంకెవరూ.. విజయ్ దేవరకొండ.. హి ఈజ్ కూల్ అండ్ వెరీ హాట్ అంటూ నవ్వుతూ బదులిచ్చింది.