సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2016 (10:39 IST)

30 సినిమాలు నటించినా విదేశాలకెళ్లలేదు.. తొలిసారిగా విజయ్ సేతుపతి బ్యాంకాక్ వెళ్తున్నారోచ్!

కోలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు కొట్టేసిన యంగ్ హీరో విజయ్ సేతుపతి ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించాడు. కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఇన్ని సినిమాల్లో నటించినా విజయ్ సేతుపతి మాత్రం విదేశాలకు

కోలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు కొట్టేసిన యంగ్ హీరో విజయ్ సేతుపతి ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించాడు. కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఇన్ని సినిమాల్లో నటించినా విజయ్ సేతుపతి మాత్రం విదేశాలకు షూటింగ్ కోసం వెళ్ళిందే లేదట. అంతేగాకుండా తొలిసారి విదేశీ లొకేషన్లలో విజయ్ సేతుపతి తొలిసారిగా ఎంజాయ్ చేయనున్నాడట. 
 
ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ''రెక్క'' సినిమా కోసం తొలిసారి విజయ్ సేతుపతి విదేశాలు వెళ్తున్నారు. "పిజ్జా", "సూదుకవ్వుం", "ఇదర్కుదానె ఆసైపట్టాయ్ బాలకుమార్", "నానుమ్‌ రౌడీదాన్", "సేతుపతి", "ఇరైవి" వంటి చిత్రాల్లో విజయ్ సేతుపతి నటించారు. ఇవన్నీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. 
 
ఈ సినిమాలన్నీ  మనదేశంలోనే అధికంగా షూటింగ్ జరుపుకున్నాయి. కనీసం పాటల కోసం కూడా ఆయన విదేశాలకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో రత్న శివ దర్శకత్వం వహిస్తున్న "రెక్క" చిత్రంలో పాటలను బ్యాంకాక్‌‌లో చిత్రీకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం హీరోహీరోయిన్లు విజయ్‌ సేతుపతి, లక్ష్మీమేనన్ వచ్చే గురువారం బ్యాంకాక్‌కి బయల్దేరి వెళ్లనున్నారు.