'ఇంకొక్కడు'లో లవ్ పాత్రలో నటించడం ఓ సవాల్ అనిపించింది : విక్రమ్
'ఇంకొక్కడు' (ఇరుమురుగన్) చిత్రంలో లవ్ పాత్రలో నటించడం ఓ సవాల్‌లా మారిందని చియాన్ విక్రమ్ చెప్పుకొచ్చాడు. విక్రమ్, నయనతార, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైన్స్ ఫిక్
'ఇంకొక్కడు' (ఇరుమురుగన్) చిత్రంలో లవ్ పాత్రలో నటించడం ఓ సవాల్‌లా మారిందని చియాన్ విక్రమ్ చెప్పుకొచ్చాడు. విక్రమ్, నయనతార, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ఇంకొక్కడు' (ఇరుముగన్). వసూళ్లు బాగానే ఉండటంతో, ఆ చిత్రం బృందం సంబరాల్లో మునిగిపోయింది.
ఈ చిత్రం విజయంపై ఆ చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు ఆనంద్ శంకర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అతడిలో మంచి ప్రతిభ ఉందన్నారు. ఆనంద్ శంకర్ భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి ఎదుగుతారని ఆయన అన్నారు. సినిమాకు కలెక్షన్లు బాగా వస్తున్నాయని చెప్పారు.
తనకు ఈ సినిమాలో నటనపరంగా మంచి పేరు వచ్చిందని పేర్కొన్నారు. ఈ సినిమాలో లవ్ పాత్రలో నటించడం తనకు ఒక సవాలుగానే అనిపించినట్లు చెప్పారు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన ఘనత ఆనంద్ శంకర్‌దేనని అన్నారు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ చిత్ర నిర్మాత శిబు తమీమ్ మాట్లాడుతూ తమ చిత్రం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1,400 థియేటర్లలో ఆడుతోందని చెప్పారు. తమిళనాడులో విజయవంతంగా రెండోవారం ప్రదర్శితమవుతోందన్నారు. చిత్రం కోసం తాము పడ్డ శ్రమకు తగ్గ ఫలితాన్ని ప్రేక్షకులు తమకు అందిస్తున్నారన్నారు.