బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 మార్చి 2023 (21:11 IST)

పుష్ప 'సామీ సామి' పాటకు అదరగొట్టిన చిన్నారి... (video)

Pushpa
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- గార్జియస్ రష్మిక మందన్న నటించిన 'పుష్ప: ది రైజ్' చిత్రంలోని హిట్ పాట 'సామీ సామి'కి ఓ పాఠశాల అమ్మాయి అద్భుతంగా డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ సినిమా 2021లో విడుదలైనప్పటికీ, ఈ చిత్రంలోని ఆకట్టుకునే డైలాగ్‌లు, ట్యూన్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.  
 
తాజాగా ఈ చిన్నారి పుష్ప లోని సామి పాటకు చేసిన డ్యాన్స్ నెట్టింటిని దద్దరింపజేస్తోంది. ఓ స్కూల్ స్టూడెండ్ చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 
ఈ వీడియోలో, చిన్న అమ్మాయి, ఆమె సహ విద్యార్థులు పాఠశాల అసెంబ్లీలో సామి సామి పాటకు డ్యాన్స్ చేయడం కనిపించింది. ఈమెను రాక్ స్టార్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఏడాదిన్నర దాటినా పుష్ప మేనియా తగ్గలేదని అభిమానులు అంటున్నారు.