మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (13:01 IST)

నాటు నాటు పాటకు స్టెప్పులేసిన పాకిస్థాన్ నటి... (వీడియో)

NaatuNaatu
ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాటకు యమా క్రేజ్ వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట అమెరికాను షేక్ చేసింది. తాజాగా పాకిస్థాన్‌లోనూ ఈ పాటకు క్రేజ్ పెరుగుతోంది. 
 
ఓ వివాహ వేడుకలో పాక్ నటి నాటు నాటుకు డ్యాన్స్ చేసిన వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. బంగారు రంగులో మెరిసే దుస్తులతో నాటు నాటు పాటకు ఆమె డ్యాన్స్ చేసింది. 
 
ఈ క్లిప్‌ను ది వెడ్డింగ్ బ్రిడ్జ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. నాటు నాటు సాంగ్ ఆస్కార్స్ 2023లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ చేయబడింది. 
 
నటుడు రామ్ చరణ్ ఇటీవల గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లో నాటు నాటు సక్సెస్ గురించి మాట్లాడారు. ఈ వారం ప్రారంభంలో లాస్ ఏంజిల్స్‌కు బయలుదేరిన చెర్రీ, ఈ సంవత్సరం ఆస్కార్స్‌లో నాటు నాటు గెలిస్తే తాను నమ్మలేకపోతానని యూఎస్ ఛానల్‌తో చెప్పుకొచ్చారు. 
 
ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమ సక్సెస్ అవుతుందన్నారు. ఇకపోతే.. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్స్ గెలుచుకుని నాటు నాటు చరిత్ర సృష్టించింది.