మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (09:05 IST)

మాస్కోలో కథక్ ప్రదర్శన... అదరగొట్టిన శ్రియా చరణ్

నటి శ్రియా చరణ్ మాస్కోలో చేసిన అద్భుతమైన కథక్ ప్రదర్శన వీడియో వైరల్ అవుతుంది. వయసు మీద పడుతున్నా.. ఏమాత్రం తరగని అందంతో వున్న శ్రియ.. తాజాగా రష్యాలోని మాస్కోలో చేసిన కథక్ నృత్య ప్రదర్శన సోషల్ మీడియాను ఆకట్టుకుంది.
 
కథక్‌లో బాగా శిక్షణ పొందిన శ్రియ తన అద్భుతమైన నృత్య నైపుణ్యాలను ప్రదర్శించింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ చేయబడింది. ఇంకా క్యాప్షన్ ఇలా ఉంది: "మాస్కోలో నా మొదటి కథక్ ప్రదర్శనలో కొంత భాగాన్ని పంచుకుంటున్నాను" అని చెప్పింది.