గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (10:43 IST)

రెండు పడవల మీద ప్రయాణం సాగదు... జెనీలియా

బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా సినిమాలకు తానెందుకు దూరంగా వున్నానని చెప్పుకొచ్చింది. జీవితంలో ఒకటి కావాలంటే మరొకటి వదిలేయాల్సిందేనని తెలిపింది. 
 
రెండు పడవల మీద ప్రయాణం సాగదు.పెళ్లయ్యాక వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించానని.. సినిమాలు చేస్తూ ఇంటిని చూసుకోవడం కుదరలేదని.. అందుకే సినిమాలు వదిలేశానని చెప్పుకొచ్చింది. అలా చేయడం వల్లే ఇవాళ ఒక మంచి ఇల్లాలిగా కుటుంబంలో పేరు తెచ్చుకున్నానని వెల్లడించింది. 
 
ప్రొడ్యూసర్‌గా సొంత ప్రొడక్షన్‌ చేస్తున్నానని... మరికొన్ని వ్యాపార సంస్థలూ స్థాపించగలిగా. ఇన్నేళ్ల తర్వాత ప్రేక్షకులు తనను మళ్లీ నటిగా ఆదరించడం హ్యాపీగా ఉందని తెలిపింది. తాను ఇష్టపడే కథలు దొరికితే ఎప్పుడైనా ఒక సినిమాలో నటిస్తానని చెప్పింది.
 
రానా సరసన నటించిన 'నా ఇష్టం' సినిమా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైంది జెనీలియా. రితేష్‌తో పెండ్లి తర్వాత పూర్తిగా వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించింది.