శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (10:56 IST)

తారకరత్న మృతి.. బాబాయి బాలయ్య కీలక నిర్ణయం

Nandamuri Balakrishna
నందమూరి హీరో తారకరత్న అకాల మరణం నేపథ్యంలో బాబాయి బాలయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. తారకరత్నకు భార్య అలేఖ్యరెడ్డి, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు వున్న సంగతి తెలిసిందే. 
 
తండ్రి పార్థివ దేహం వద్ద ఆయన ఆయన పెద్ద కూతురు వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో అందరిని కలచి వేసింది. ఆయన మరణంతో భార్య, పిల్లలు ఒంటరి వారైపోయారు. దీంతో తారకరత్న కుటుంబం విషయంలో బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు.
 
తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యత తాను తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. బాబాయ్‌గా తారక్ కుటుంబానికి నిత్యం అండగా వుంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చారట.ఇక తారకరత్న, బాలకృష్ణకు మధ్య మంచి అనుబంధం వున్న సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. తారకరత్న పార్ధివ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించనున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. 
 
ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తారకరత్న అకాల మరణం నేపథ్యంలో బాబాయి బాలయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు