మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (13:48 IST)

ఒకే రోజున అన్నతమ్ముల పిల్లలు ఆత్మహత్యలు - ఎక్కడ?

suicide
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని మాచనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అన్నతమ్ముల పిల్లలు ఒకే రోజున ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో ఆ గ్రామంలో విషాదంనెలకొంది. మృతుల్లో ఒకరు యువతికాగా, మరొకరు యువకుడు ఉన్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల సంగీత అనే యువతి గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంది. నొప్పి నయం చేసుకునేందుకు ఎంతో మంది వైద్యుల వద్ద చూపించినా ఫలితం లేకుండా పోయింది. అదేసమయంలో కడపునొప్పి కూడా రోజురోజుకూ ఎక్కువైసాగింది. ఈ నొప్పిని భరించలేని సంగీత ఇంట్లోనే ఉన్న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. 
 
అలాగే, ఇదే గ్రామానికి చెందిన ఎడ్ల భాస్కర్ అనే యువకుడు కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతూ గత కొంతకాలంగా వైద్యం చేయించుకుంటున్నారు. కానీ, వ్యాధి మాత్రం ఎంతకీ నయం కాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి లోనైన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎడ్ల సంగీత, ఎడ్ల భాస్కర్‌లు ఒకే గ్రామానికి చెందిన అన్నతమ్ముల పిల్లలు కావడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.