గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2022 (16:37 IST)

విశాఖ ఎండాడలో విషాదం : మిద్దెపై నుంచి కిందపడిన వైద్య విద్యార్థి మృతి

deadbody
విశాఖపట్టణంలోని ఎండాడలో విషాదం చోటుచేసుకుంది. మిద్దెపై నుంచి కిందపడిన ఓ వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని గోగినేని గిరితేజగా గుర్తించారు. ఈ యువకుడు ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నాడు.
 
ఎండాడలోని వైశాఖి స్కైలైన్‌లో బి బ్లాక్‌ బహుళ అంతస్తు భవనం పైనుంచి కిందపడిపోయాడు. దీంతో గిరితేజ తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.