రానా-సాయి పల్లవిల విరాటపర్వం.. ఓటీటీలో కాదు.. థియేటర్లలోనే..?
Virataparvam
కరోనా మహమ్మారి నేపథ్యంలో థియేటర్లు మూత పడటంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే నిర్మాతలు ఈ మూవీని ఓటీటీలో కాకుండా థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట.
సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది. 1980 బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో ప్రియమణి కామ్రేడ్ భారతక్క రోల్‌లో కనిపించనుంది.
