శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (22:12 IST)

లవ్ స్టోరీ వచ్చేది థియేటర్లోనా..? ఓటీటీలోనా..?

అక్కినేని నాగచైతన్య నటించిన మజిలీ, వెంకీమామ చిత్రాలు వరుసగా సక్సస్ సాధించడంతో లవ్ స్టోరీపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తుండడం... దీనికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్టర్ కావడంతో ఈ సినిమాతో చైతన్య హ్యాట్రిక్ సాధిస్తాడని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.
 
ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ సాంగ్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో లవ్ స్టోరీ ఖచ్చితంగా సక్సెస్ సాధించడం ఖాయం అనే నమ్మకంతో ఉన్నారు. ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా ఆగింది. ఇటీవల లవ్ స్టోరీ షూటింగ్ స్టార్ట్ చేసారు. హైదరాబాద్ లోని సారధీ స్టూడియోలో లవ్ స్టోరీ షూటింగ్ జరుగుతుంది.
 
నాగచైతన్య, సాయిపల్లవిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే... ఇప్పుడు ఈ మూవీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది..? రిలీజ్ ఎప్పుడు..? థియేటర్లో రిలీజ్ చేస్తారా..? ఓటీటీలో రిలీజ్ చేస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. అక్టోబర్ నెలాఖరుకు షూటింగ్ కంప్లీట్ చేస్తారని అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతికి రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.
 
అయితే.. ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారా..? థియేటర్లో రిలీజ్ చేస్తారా..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. విషయం ఏంటంటే... ఓటీటీలో రిలీజ్ చేయమని పెద్ద ఆఫర్స్ వచ్చాయట కానీ.. ఈ చిత్ర నిర్మాతలు మాత్రం థియేటర్లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని అంటున్నారు. అయితే.. క్రిస్మస్‌కి వస్తుందా..? సంక్రాంతికి వస్తుందా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.