శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Modified: గురువారం, 27 ఆగస్టు 2020 (18:15 IST)

అన్ లాక్ 4.0, సినిమా చూసేందుకు జనం థియేటర్స్‌కి వస్తారా?

అన్‌లాక్ 4.0ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది. ఈసారి సినిమా థియేటర్లకు అవకాశం ఉండవచ్చునని కొందరి అభిప్రాయం. ఇప్పటికే షూటింగ్‌లకు పర్మిషన్ వచ్చింది. ఒకవేళ సినిమాలు రిలీజ్ చేసుకునే అవకాశం వస్తే ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పించే సత్తా హీరోలకు ఉందా అనేది ప్రశ్న.
 
సెప్టెంబరు నుండి టాలీవుడ్‌కి కాస్త ఊరట కలిగించే అవకాశం ఉంది. ఒకవైపు సినిమాలు షూటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మరోవైపు సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. ఐతే స్టార్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఓకే చెప్తారా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలు లైన్లో వున్నాయి. చిన్నహీరోల చిత్రాలు కూడా రెడీగా వున్నాయి.
 
ఈ చిత్రాలు ఒకవేళ రిలీజ్ అయినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? కరోనా భయంతో అత్యవసరమైతే తప్పించి ఇంటినుండి బయటికి రాని ప్రజలు సినిమా చూసేందుకు థియేటర్లుకు వస్తారా అనేది సందేహమే. అలాగే లాక్‌డౌన్ మొదలైన దగ్గర్నుంచి ఓటీటీ ప్లాట్ఫాంకు అలవాటుపడ్డ ప్రేక్షకులు సినిమా హాళ్లకు వస్తారా అనేది పెద్ద ప్రశ్న.