సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (11:50 IST)

అనుష్క ప్రెగ్నెంట్.. కన్ఫామ్ చేసిన విరాట్ కోహ్లీ.. వెల్లువెత్తుతున్న కంగ్రాట్స్

Virushka
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సినీ నటి అనుష్క శర్మలు శుభవార్త చెప్పారు. ప్రస్తుతం అనుష్క గర్భవతి అని.. ఇద్దరిగా ఉన్న తమ కుటుంబం త్వరలోనే ముగ్గురిగా మారబోతుందని చెప్పాడు. ఇంకా దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇదిచూసిన అభిమానులు వీరుష్కా జంటకు అభినందనలు తెలుపుతున్నారు. ఇకపోతే 2017 డిసెంబర్​లో ఈ జంట వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.
 
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ త్వరలో తల్లిదండ్రులు కానున్న విషయం బయటికి రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తమ ఇంటికి వచ్చే జనవరి 2021వ సంవత్సరం కొత్త వ్యక్తి వస్తారని చెప్పాడు విరాట్ కోహ్లీ. ఇకపోతే.. అనుష్క నాలుగు నెలల గర్భవతి అని తెలుస్తోంది. తన బిడ్డ బంప్‌ను చూపిస్తూ, అనుష్క శర్మ తన క్రికెటర్ కోహ్లీతో ఫోజిచ్చిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నలుపు, తెలుపు పోల్కా డాట్ డ్రెస్‌లో అనుష్క అద్భుతంగా కనిపించింది.
 
అలాగే విరాట్ సతీమణి అనుష్క కూడా అదే పేజీని తన పేజీలో షేర్ చేసింది. అలియా భట్ నుండి తాప్సీ పన్నూ వరకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమెకు అభినందనలు తెలిపారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం యుఎఇలో ఉన్నారు. ఐపిఎల్ 2020లో పాల్గొనడానికి కోహ్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.