బుధవారం, 26 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (14:34 IST)

స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఉంది - విలన్ పాత్రలకు రెడీ : మిమో చక్రవర్తి

Mimo Chakraborty
Mimo Chakraborty
'నేనెక్కడున్నా  సినిమా చేస్తున్నానని నాన్న మిథున్ చక్రవర్తి గారికి తెలిసినప్పుడు నువ్ 100 పర్సెంట్ ఇవ్వు' అని చెప్పారు. ఆర్టిస్టులకు, హీరో హీరోయిన్లకు భాష అనేది అడ్డు కాదు. కాకూడదు. ఇవాళ నేను తెలుగు సినిమా చేశా. రేపు ఆవకాశం వస్తే తమిళ, మలయాళ, పంజాబీ, భోజ్ పూరి సినిమాలు చేస్తాను. నాకు తెలుగు సినిమాలో అవకాశం రావడం పట్ల నాన్న సంతోషం వ్యక్తం చేశారు. భాష రాదని అసలు ఆలోచించవద్దని చెప్పారు అని మిమో చక్రవర్తి అన్నారు.
 
బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి తెలుగు చిత్రసీమకు హీరోగా పరిచయం అవుతున్నారు. ఇందులో ఎయిర్ టెల్ ఫేం సషా చెత్రి హీరోయిన్. కేబీఆర్‌ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన చిత్రమిది. మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 28న సినిమా విడుదల కానున్న సందర్భంగా మిమో చక్రవర్తి పలు విషయాలు తెలిపారు. 
 
- నా చైల్డ్ హుడ్ అంతా సౌత్ మూవీస్ చూస్తూ గడిపా. ఊటీలో మా నాన్న గారికి హోటల్ ఉంది. నేను అక్కడ ఉన్నాను. అందువల్ల, తెలుగు - తమిళ సినిమాలు చూస్తూ పెరిగా. ఏ పని చేసినా 100 పర్సెంట్ నిజాయతీగా చేయమని చెప్పారు. నటుడిగా మాత్రమే కాదు, వ్యక్తిగా కూడా నిజాయతీగా ఉండమని చెప్పారు. ఒకవేళ ఏదైనా పని చేయకూడదని అనిపిస్తే చేయవద్దని చెప్పారు.
 
- హిందీ సినిమా 'ఓ మై గాడ్'ను తెలుగులో 'గోపాల గోపాల'గా రీమేక్ చేశారు కదా! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేవుడి పాత్ర చేశారు. అందులో నాన్న నటించారు. ఒరిజినల్, రీమేక్... రెండు సినిమాలు చూశా. ప్రజెంట్ ప్రభాస్ గారి 'ఫౌజీ' సినిమాలో నటిస్తున్నారు. ఫాదర్ అండ్ సన్ కంటే స్నేహితులుగా ఉంటాం. బయట జనాలకు ఆయన సూపర్ స్టార్. కానీ, నాకు నాన్న. ప్రాక్టికల్ ఫాదర్ అని చెప్పాలి. 
 
- 'నేనెక్కడున్నా' సినిమా  ఫిమేల్ ఓరియెంటెడ్. కథ విన్నప్పుడు ఇందులో మహిళా సాధికారిత, మహిళా జర్నలిజం గురించి మాత్రమే చెప్పలేదు. ఇదొక సందేశాత్మక సినిమా కాదు. ఇందులో మెసేజ్ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్... ఇదొక కంప్లీట్ పాప్ కార్న్ ఎంటర్‌టైనర్. పాటలు, మంచి యాక్షన్ సీక్వెన్సులు, సన్నివేశాలు ఉన్నాయి. మహిళా జర్నలిస్టులు తమ కాళ్ళ మీద ఎందుకు నిలబడలేరు? అనే చక్కటి సందేశాన్ని ఇస్తుంది.
 
- ఈ  సినిమాకు నాకంటే ముందు సాషా ఛెత్రి కన్ఫర్మ్ అయ్యింది. నా ఫ్రెండ్ ఒకరు ఆయనకు తెలుసు. సినిమాలో నేను పోషించిన పాత్ర కోసం నటులను చూస్తున్నారని తెలిసి నన్ను రికమండ్ చేశారు. అప్పుడు దర్శకుడు మాధవ్ కోదాడ ముంబై వచ్చి నాకు కథ చెప్పారు. కథ విన్న వెంటనే 'ఎస్' చెప్పాను. మంచి సందేశంతో కూడిన ఫిల్మ్ మాత్రమే కాదు... నాకు తెలుగులో మంచి డెబ్యూ అవుతుందని అనుకున్నాను.
 
- ఇందులో హీరోగా చేశా. ఒకవేళ విలన్ రోల్ చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. విలన్ క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తున్నాను. విలన్ పాత్రలకు నేను పర్ఫెక్ట్ ఫిట్ అనుకుంటున్నాను. నటుడిగా నన్ను నేను పరిమితం చేసుకోవాలని అనుకోవడం లేదు. మంచి క్యారెక్టర్లు వస్తే కమెడియన్, సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా రెడీ.
 
- దర్శకుడు మాధవ్ కోదాడ ఇంతకు ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారు. అయితే, ఇది ఆయన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. దీని కోసం ఎంతో కష్టపడ్డారు. నాలుగేళ్లు ఈ సినిమా కోసం టైం ఇచ్చారు. సినిమా విడుదల వరకు వచ్చిందంటే కారణం ఆయనే. ఆయనకు కేబీఆర్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. విక్రమ్ భట్ వంటి గొప్ప దర్శకులతో పని చేశా. వాళ్ళు నటించి చూపించేవారు. మాధవ్ కోదాడ కూడా అంతే! ఆయన సీన్ వివరించిన తర్వాత ఎలా నటించాలనేది ఆర్టిస్టులకు వదిలేస్తారు.
  
- తెలుగులో నాకు ఇష్టమైన హీరోలు.. పవన్ కళ్యాణ్, ప్రభాస్, దళపతి విజయ్ అంటే ఇష్టం. రజనీకాంత్ అన్నా ఇష్టమే. మిగతా స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేయాలని ఉంది. విక్రమ్ భట్ దర్శకత్వంలో పదమూడేళ్ల క్రితం చేసిన హిట్ ఫిల్మ్ 'హాంటెడ్' సీక్వెల్ చేస్తున్నా. నెట్‌ఫ్లిక్స్‌ కోసం 'ఖాకి' వెబ్ సిరీస్ సీజన్ 2 చేస్తున్నాను.