1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 24 మే 2025 (13:19 IST)

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

Harihara Veeramallu,
Harihara Veeramallu,
జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ ముఖ్య కార్యదర్శికి  రాష్ట్ర సినిమాటోగ్రఫీ,  పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ దిశానిర్దేశం చేశారు. గత రాత్రి ఓ ప్రకటన విడుదలచేసింది.
 
హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసి వేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ,  పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ స్పందించి హోం శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కుమార్ విశ్వజిత్ తో మాట్లాడారు.
 
ఈ పరిణామంతోపాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్ గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించీ విచారణ చేయాలని శ్రీ దుర్గేష్ స్పష్టం చేశారు. సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుంది అనే కోణంలోనూ వివరాలు సేకరించబోతున్నారు.
 
 ఆ నలుగురిపై జనసేన సీరియస్
ఇదిలా వుండగా, సోషల్ మీడియాలో ఆ నలుగురిపై తీవ్ర విమర్శలు వెల్లువస్తున్నాయి. "చేయూతనిచ్చిన చేతినే నరకడానికి వెనుకాడని ఆ నలుగురు ఎవరు???" హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 వ విడుదల అవుతున్న తరుణంలో జూన్ 1వ తేదినుండి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని  ధియేటర్లు మూసివేయాలనే నిర్ణయం వెనుక ఏ కుట్ర దాగి ఉన్నదో?  ధియేటర్ల సమస్యలు... హరిహర వీరమల్లు విడుదల అవుతున్న తరుణంలోనే ఆ 'నలుగురికి' గుర్తుకు వచ్చియా ?? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త !!! అంటూ జనసేన కార్యకర్తలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.