మంగళవారం, 1 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 28 మార్చి 2025 (19:04 IST)

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Actress Shruti Narayanan shocking comments
తన కాస్టింగ్ కౌచ్ వీడియో ఆన్‌లైన్‌లో లీక్ అయిన నేపథ్యంలో నటి శ్రుతి నారాయణన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక నోట్‌ను షేర్ చేసింది. ఇది తనకు, తన కుటుంబానికి కష్టకాలం అని పేర్కొంది. లీక్ అయిన వీడియోను షేర్ చేయడం మానేయాలని ఆమె ప్రజలను కోరింది. తన అభ్యర్థనను పక్కన పడేసి ఇంకా ఆ వీడియోలను షేర్ చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
 
ఇన్ స్టాగ్రాంలో శ్రుతి నారాయణన్ ఇలా పేర్కొంది. ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక జోక్ లేదా సరదా కంటెంట్ కాదు. ఇది ఒక జీవితం, అలాంటి దాన్ని ఏదో తమాషాగా చేస్తున్నారు. నేను కూడా ఒక అమ్మాయినే. వారిలాగే భావాలను కలిగి ఉంటాను. మీరు దానిని మరింత దిగజార్చుతున్నారు. ఇంకా ఇవే వీడియోలను మీరు షేర్ చేయాలనుకున్నా, చూడాలనుకున్నా మీ తల్లి, సోదరి లేదా స్నేహితురాలి వీడియోలను చూడండి, ఎందుకంటే వారు నాలాగే ఉంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.