1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (07:44 IST)

కళాపురంలో ఏం జ‌రిగింది?

Satyam Rajesh, chitram Srinu and others
Satyam Rajesh, chitram Srinu and others
క‌ళాపురంలో అంద‌రూ క‌ళాకారులే అలాంటి ఊరిలో ఏం జ‌రిగింది? అనే పాయింట్‌తో కళాపురం చిత్రం రూపొందింది.  ‘పలాస 1978’ .. ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఫేమ్ క‌రుణ కుమార్ ఈసారి అందుకు భిన్నంగా కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మే ‘కళాపురం’ ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే’ సినిమా క్యాప్షన్. ఆగస్ట్ 26న సినిమా రిలీజ్ అవుతోంది. జీ స్టూడియోస్‌, ఆర్ 4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ర‌జనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. స‌త్యం రాజేష్‌, చిత్రం శ్రీను, త‌దిత‌రులు న‌టించారు.
 
నిర్మాత ర‌జినీ తాళ్లూరి మాట్లాడుతూ ‘‘మా ఆయ‌న నాకు ఎంతో స‌పోర్ట్ చేశారు. సినిమా ఈరోజు ఇంత చ‌క్క‌గా వ‌చ్చింది. నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే మా టీమే కార‌ణం. సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశాను. డైరెక్ట‌ర్ క‌రుణ కుమార్‌గారు, జీ స్టూడియోస్ వారు, రాజేష్‌గారు, మ‌ణిశ‌ర్మ‌గారు ఇలా అంద‌రూ స‌పోర్ట్ చేయ‌టంతో ప్లానింగ్ ప్రకారం సినిమాను పూర్తి చేశాం. ఆగ‌స్ట్ 26న మూవీ రిలీజ్ అవుతుంది. అంద‌రూ మూవీని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
 
ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్ మాట్లాడుతూ ‘‘థియేటర్స్‌కి జ‌నాలు రావ‌టం లేదు. కంటెంట్ ఉన్న సినిమాలు రావ‌టం లేదు. వాట‌న్నింటినీ బ్రేక్ చేద్దామ‌నే ఉద్దేశంతో చేసిన సినిమానే ‘కళాపురం’. ఇప్పటి వ‌ర‌కు కంటెంట్ బేస్డ్ మూవీల‌నే చేశాను. ఈ సినిమా కామెడీ సినిమా అయినప్ప‌టికీ ఎక్క‌డా బూతులు వాడ‌లేదు. ఒక‌రినొక‌రు కొట్టుకోవ‌టం లేదు. అశ్లీల‌త లేదు. ఇత‌రుల‌ను కించ ప‌రిచే కామెడీ లేదు. ఆరోగ్య‌వంత‌మైన కామెడీ మూవీ చేయాల‌ని అనుకుని క‌థ‌ను రాసుకుని తీసిన సినిమా ఇది. కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సినిమాను చూసిన వారంద‌రూ హ్యాపీగా ఫీల‌య్యారు. మంచి కంటెంట్‌ను ప్రోత్స‌హించాల‌ని అంద‌రినీ కోరుకుంటున్నాను. ఆగ‌స్ట్ 26న మూవీ థియేట‌ర్స్‌లో రిలీజ్ అవుతుంది.
 
జీ స్టూడియో నిమ్మ‌కాల‌య ప్ర‌సాద్‌ మాట్లాడుతూ ‘‘‘కళాపురం’ ఎడిట్ వెర్ష‌న్ చూసిన‌ప్పుడు అసిస్టెంట్ ఎడిట‌ర్ నాకు ఫోన్ చేసి.. సినిమా చాలా బావుంది. సినిమాను థియేట‌ర్స్‌లో రిలీజ్ చేయ‌మ‌ని అన్నారు. అలా ‘కళాపురం’ మూవీని ఆగ‌స్ట్ 26న థియేట‌ర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. స‌బ్ టైటిల్స్ ఉన్న సినిమాను చూసి ముంబై నుంచి వ‌చ్చిన వాళ్లే ఎంజాయ్‌చేశారు. రేపు థియేట‌ర్స్‌లో అంద‌రినీ మెప్పిస్తుంది.. న‌వ్విస్తుంది’’ అన్నారు.
 
స‌త్యం రాజేష్ మాట్లాడుతూ ‘‘‘కళాపురం’ సినిమా విషయంలో రజినీ తాళ్లూరిగారికి, రామ్ తాళ్లూరిగారికి థాంక్స్. వారికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. అందుకు కార‌ణం చాలా మంచి సినిమాను నాకు ఇచ్చారు. ఓ సినిమాను చేయాల‌ని దాదాపు ఏడాదిన్న‌ర‌గా వారితోనే ట్రావెల్ చేస్తూ వ‌చ్చాను. ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్‌గారికి థాంక్స్‌. సినిమా మేం అనుకున్న టైమ్‌లో పూర్తి చేశామంటే క‌రుణ కుమార్‌గారే కార‌ణం. వంద శాతం సినిమాను అంద‌రూ ఎంజాయ్ చేస్తారు. క్యూట్ కామెడి. ట్రైల‌ర్ చూస్తేనే సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. చిత్రం శ్రీను చాలా రోజుల త‌ర్వాత చాలా మంచి పాత్ర చేశాడు. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.
 
చిత్రం శ్రీను మాట్లాడుతూ ‘‘చాలా రోజుల తర్వాత చాలా మంచి పాత్ర చేశాను. ఆగస్ట్ 26న వస్తున్న ఈ సినిమాను చూసి అందరూ పగలబడి నవ్వుకుంటారు. మంచి రోల్ ఇచ్చిన దర్శకుడు కరుణ కుమార్‌గారికి, నిర్మాత ర‌జినీ తాళ్లూరిగారు స‌హా సినిమాలో వర్క్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్’’ అన్నారు.