గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (13:50 IST)

ప్ర‌త్యేక పూజ‌లు చేయించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay, ananya, madhavi, poojarulu
Vijay, ananya, madhavi, poojarulu
విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమాతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిపోయాడు. ఆయ‌న‌తోపాటు అన‌న్య పాండే పేరు కూడా మారుమోగిపోతుంది. లైగ‌ర్ ప్ర‌మోష‌న్ సంద‌ర్భంగా దేశ‌మంతా తిరిగారు. అక్క‌డ అభిమానులు, ప్రేక్ష‌కుల ప్రేమ‌ను పొందారు. ఇదంతా కొత్త‌గా వున్నా, విజ‌య్ దేవ‌ర‌కొండ మాతృమూర్తికి మాత్రం ఒక్కోసారి నిద్ర స‌రిగా ప‌ట్టేదికాట‌. ఎట్ట‌కేల‌కు హైద‌రాబాద్ వ‌చ్చారు. మంగ‌ళ‌వారంనాడు మీడియాకు ప‌లు ర‌కాల ఇంట‌ర్వ్యూలు ఇచ్చి బాగా అసిపోయాడు.
 
vijay, annya, madhavi
vijay, annya, madhavi
ఇదే విష‌యం మాట్టాడుతూ, చాలా అల‌సిపోయాను. షూటింగ్ కంటే ప్ర‌చారం కోసం చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చిందంటూ పేర్కొన్నారు. దాంతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంటి ద‌గ్గ‌రే వుండ‌డంతో బుధ‌వారంనాడు ఆమె మాతృమూర్తి మాధవి (వ్యక్తిత్వ వికాస శిక్షకురాలు) ఇంటిలో ర‌క్ష‌ణ పూజ చేయించింది. పూజారుల మంత్రోత్సార‌ణ‌తో వారి ఆశీర్వాదాలు అందుకున్నారు. అనంత‌రం ఆమె పూజ అనంత‌రం ఇచ్చిన ర‌క్ష‌ణ బంధాన్ని విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, అన‌న్య‌కు క‌ట్టింది.
 
Raksha kavacham
Raksha kavacham
ఈ సంద‌ర్భంగా విజ‌య్ ట్వీట్ చేస్తూ,  ఈ నెల మొత్తం భారతదేశం అంతటా పర్యటించడం మరియు చాలా ప్రేమను పొందడం ఇప్పటికే దేవుని ఆశీర్వాదంగా భావించబడింది.  అందుకే  మమ్మీ మాకు దేవుని  రక్షణ అవసరమని భావిస్తుంది.  కాబట్టి పూజ  చేయించి  మా నందరికీ పవిత్రమైన బ్యాండ్‌లు  క‌ట్టింది. ఇప్పుడు మేము మా పర్యటనను కొనసాగిస్తున్నాం.  ఆమె ప్రశాంతంగా వుంది. అన్నారు. ఆయ‌న‌తోపాటు ఆనంద్ దేవ‌ర‌కొండ‌కూడా ర‌క్ష‌ణ బంధాన్ని క‌ట్టించుకున్నారు. ఆనంద్ న‌టించిన  క‌ళాపురం సినిమా కూడా త్వ‌ర‌లో విడుద‌ల‌కాబోతోంది.