సోమవారం, 18 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 మార్చి 2017 (13:31 IST)

బండ్ల గణేష్ వ్యాపార విస్తరణకు బ్రేకులు వేసిన బీజేపీ... ఎలా.. ఎక్కడ?

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ వ్యాపార విస్తరణకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నష్టపరిచింది. ఇది ఆయనకు కోలుకోలేని ఎదురుదెబ్బ. భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విజయభేరీ మోగించడంతో ఆయన వ్యాపార విస

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ వ్యాపార విస్తరణకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నష్టపరిచింది. ఇది ఆయనకు కోలుకోలేని ఎదురుదెబ్బ. భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విజయభేరీ మోగించడంతో ఆయన వ్యాపార విస్తరణ ప్లాన్‌ను విరమించుకున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చిన్న చిన్న వేషాలతో సినీ జీవితాన్ని ప్రారంభించి, బడా నిర్మాతగా ఎదిగిన వ్యక్తి బండ్ల గణేష్. ఈయన తీసిన చిత్రాలు కొన్ని నష్టాలను మిగల్చడంతో పౌల్ట్రీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలంగాణా రాష్ట్రంలో రెండు వేల కోళ్లతో ఈ వ్యాపారాన్ని ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం ఇది 25 లక్షల కోళ్లకు విస్తరించింది. 
 
తన వ్యాపార ప్రస్థానంలో, పౌల్ట్రీ బిజినెస్‌ను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కూడా విస్తరించేందుకు బండ్ల గణేష్ యత్నించారు. అక్కడ పౌల్ట్రీ ఫామ్‌లు పెట్టేందుకు 100 ఎకరాల భూమిని కూడా సిద్ధం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ తనకు తక్కువ ధరకే ఈ భూమిని కేటాయించారని బండ్ల తెలిపారు. దీని కోసం తనకు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సహకరించారని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
 
అయితే, తాజా ఎన్నికల్లో ఎస్పీ ఓడిపోయారు. బీజేపీ గెలుపొందింది. దీంతో అఖిలేష్ ముఖ్యమంత్రి అయితేనే అక్కడ పౌల్ట్రీ పెడతానని ప్రకటించిన బండ్ల గణేష్.. ఇపుడు బీజేపీ సర్కారు ఏర్పాటుకానుండటంతో తన నిర్ణయాన్ని మరో ఐదేళ్ళకు వాయిదా వేసుకున్నారు. ఈ విధంగా బండ్ల గణేష్‌కు బీజేపీ నష్టం కలిగించింది.