స్విట్జర్లాండ్‌లో ప్రిన్స్, చెర్రీ దంపతుల నూతన సంవత్సర వేడుకలు.. ట్విట్టర్లో ఫోటోలు..
సూపర్ స్టార్ ఇంటికి రీసెంట్‌గా ఓ స్పెషల్ అతిథి దర్శనమిచ్చాడు. ఆయన ఎవరో కాదు… మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. ఈ ఇద్దరి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. తరచుగా ఫోన్‌లో మాట్లాడుకోవడం, ఒకరి సిని
సూపర్ స్టార్ ఇంటికి రీసెంట్‌గా ఓ స్పెషల్ అతిథి దర్శనమిచ్చాడు. ఆయన ఎవరో కాదు… మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. ఈ ఇద్దరి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. తరచుగా ఫోన్‌లో మాట్లాడుకోవడం, ఒకరి సినిమాలపై మరొకరు మాట్లాడుకోవడం తెలిసిందే. మహేష్ ఇంటికి రామ్‌చరణ్ ఫ్యామిలీతో సహా వెళ్లాడని సమాచారం. మహేష్ తనయుడు గౌతమ్‌తోపాటు మహేష్ బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఉన్నాడు.
డిన్నర్‌కి ఇన్వయిట్ చెయ్యగా రామ్‌చరణ్, ఉపాసన వెళ్లారని తెలుస్తోంది. ఈ ఫోటోని క్లిక్ మనిపించింది ఉపాసన, నమ్రతలేనట. ఇదిలా ఉంటే... స్విట్జర్లాండ్‌లోని జురిచ్ నగరంలో వీరు న్యూఇయర్ వేడుకలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుటుంబం, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తీసిన ఫొటోలను మహేశ్ సతీమణి నమ్రత, చెర్రీ సతీమణి ఉపాసన సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. మహేశ్, నమ్రత, చెర్రీ, ఉపాసన బ్లాక్ కలర్ పార్టీ వేర్‌లో మెరిశారు. గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.