శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: సోమవారం, 1 జులై 2019 (10:18 IST)

బాలీవుడ్ నుంచి తప్పుకున్న 'దంగల్' నటి, ఆమెను భయపెట్టిందెవరు?

దంగల్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఆ చిత్రంలో క్రీడాకారిణిగా నటించిన జైరా వాసిం తను బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది.

ఇండస్ట్రీలో ముస్లింలకు వ్యతిరేకంగా బెదిరింపులకు దిగుతున్న కారణంగా తను ఇండస్ట్రీ నుంచి వైదొలగాలనుకున్నట్టు ప్రకటించింది. తన మానసిక ప్రశాంతతను, దేవుడితో తనకున్న అనుబంధాన్ని చెడగొట్టేలా ఉన్న ఇలాంటి వాతావరణంలో నేను కొనసాగడం దుర్లభం అంటూ వ్యాఖ్యానించింది. 
 
ఐతే జైరా వాసింను ఇబ్బందులకు గురి చేసింది ఎవరో, తనను భయపెట్టినవారు ఎవరోనన్న వివరాలను వెల్లడించలేదు. దీనితో ఆమె సినీ ఇండస్ట్రీని వదిలివెళ్లిపోయేందుకు కారకులు ఎవరన్నదానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు జైరా వాసిమ్ సినిమాలకు గుడ్ బై చెప్పడంపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో స్పందిస్తూ ఆమె తీసుకున్న నిర్ణయంపై స్పందిచాడానికి మనమెవరం? ఎవరి జీవితం వాళ్ల ఇష్టం. వాళ్ల ఇష్టప్రకారమే మంచి జరగాలని కోరుకుంటున్నాని పేర్కొన్నారు.