శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (12:22 IST)

వేధింపులు ఎదుర్కొన్నాను కానీ బయటపెట్టను : బాలీవుడ్ హీరోయిన్

'దంగల్' సినిమాలో తన నటనతో మెప్పించిన బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ మరోసారి తనకు ఎదురైన #మీటూ అనుభవాలు, లైంగిక వేధింపుల గురించి నోరువిప్పారు. తనకు కూడా బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకోక ముందు లైంగిక వేధింపులు ఎదురైనట్లు తెలిపారు.
 
ఇటీవల ఓ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... లైంగిక వేధింపుల సమస్య కేవలం సినిమా ఇండస్ట్రీలో, అది కూడా బాలీవుడ్‌లో లేదని, అన్ని రంగాల్లో ఇలాంటి సంఘటనలు మహిళలకు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. #మీటూ ఉద్యమం కేవలం బాలీవుడ్ పరిశ్రమకు చెందినదే అని అందరూ త
Fatima Sana Shaikh
ప్పుగా అర్థం చేసుకుంటున్నారు. 
 
అంతేకాకుండా ‘‘చాలా మంది అనుకుంటున్నట్లు #మీటూ సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. నేను దాని గురించి ఎందుకు మాట్లాడకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మన దేశంలో ప్రతి మహిళ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి సమస్య ఎదుర్కొనే ఉంటారు. వారంతా ఆ విషయాలను పబ్లిక్‌గా వచ్చి మాట్లాడతారని నేననుకోవడం లేదు. 
 
ఎందుకంటే ఇది వారి వ్యక్తిగత విషయం'' అని ఫాతిమా సనా షేక్ తెలిపారు. అయితే గతంలో కూడా పలుమార్లు తనకు లైంగిక వేధింపులు ఎదురైనట్లు తెలిపిన ఫాతిమా, ఆ వివరాల, సదరు వ్యక్తుల పేర్లు పంచుకోవడానికి ఇష్టపడలేదు. ఇది తన వ్యక్తిగత విషయమని పేర్కొన్నారు.