సోమవారం, 30 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2019 (11:23 IST)

ప్రవాస భారతీయుడికి పిన్న వయస్సులోనే పెద్ద గుర్తింపు...

పిట్ట కొంచెం కూత ఘనం.. అంటే ఇదేనేమో మరి... ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించిన మెలకువలను తెలుసుకున్న రిషి భగారియా(18) అనే ప్రవాస భారతీయుడికి అంతర్జాతీయ సంస్థలో భాగస్వామ్యం లభించింది. 
 
వివరాలలోకి వెళ్తే... రిషి ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుటి నుండి తన సోదరుడు, అంకుల్ సాయంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై పట్టు సాధించాడు. వారిద్దరూ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే సంస్థలో సలహాదారులుగా పనిచేస్తున్నారని చెప్తున్న రిషి వారి ప్రోద్భలం వల్లే తాను అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ సంస్థ థెస్సాల్స్ క్యాపిటల్‌లో భాగస్వామిని కాగలగానని అంటున్నాడు. 
 
థెస్సాల్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మైకేల్ మాట్లాడుతూ రిషిలో అద్భుతమైన ప్రతిభ దాగివుందనీ, దానికి గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై చిన్న వయసులోనే పట్టు సాధించడమంటే మాములు విషయం కాదన్నారు. ఎంతో తపన ఉంటే తప్ప అది సాధ్యం కాదన్నారు. భవిష్యత్తులో రిషి ఉన్నత స్థానాలను అధిరోహిస్తాడని ఆయన తెలిపారు. 
 
ఏది ఏమైనప్పటికీ... ఒక ప్రవాస భారతీయుడు పిన్న వయస్సులోనే ఉన్నత శిఖరాలు అధిరోహించడం గర్వపడాల్సిన విషయమేగా మరి.