బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (11:59 IST)

చిగురుపాటి జయరామ్ హత్య కేసు : హాస్య నటుడు సూర్యప్రసాద్ అరెస్టు

ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంకు ఛైర్మన్, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసులో హైదరాబాద్ నగర పోలీసులు మరో ముగ్గురిని గురువారం అరెస్టు చేశారు. వీరిలో ఒకరు తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హాస్య నటుడు సూర్యప్రసాద్ ఒకరు ఉన్నారు. 
 
ఎన్నారై జయరామ్ హత్య కేసును హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్న విషయం తెల్సిందే. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడుని అరెస్టు చేసిన పోలీసులు.. అనేక దఫాలుగా వివిధ కోణాల్లో విచారించిన తర్వాత హాస్య నటుడు సూర్యప్రసాద్‌తో పాటు ఆయన అసిస్టెంట్ కిషోర్, సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
జయరాం హత్య విషయం ముందే తెల్సినా అంజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, హత్యకు పరోక్షంగా సూర్య, కిషోర్‌ సహకరించడంపై విచారణ చేపట్టారు. ఈ ముగ్గురిని రేపు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.