గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (12:52 IST)

రేణు దేశాయ్‌ను F**k అంటూ నెటిజన్ ట్రోలింగ్.. ఆ పదాన్ని మేం వాడితే?

రేణు దేశాయ్ పేరుకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ప్రముఖులలో ఒకరైన ఈమె ప్రస్తుతం రైతులపై ఓ డాక్యుమెంటరీ తీస్తున్నారు. ఇందులో ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పర్యటించి కొందరు రైతుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకోగా, ఓ వ్యక్తి పెట్టిన అసభ్యకరమైన కామెంట్ ఆమెను మనస్తాపానికి గురి చేసింది. 
 
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి "నాది రైతు కుటుంబం, దాదాపు 2 దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నా, f**k మీరు రైతులకు ఏమీ చేయడం లేదు. కేవలం ముఖానికి రంగు పులుముకుని డ్రామా చేస్తున్నారు అంటూ దూషించాడు.
 
దీనిపై స్పందిస్తూ రేణు "ఈ పోస్ట్ ఖచ్చితంగా చదువుతారని అనుకుంటున్నాను.. ఒక సెలబ్రిటీ ఎప్పుడన్నా "ఎఫ్" అనే పదాన్ని సోషల్ మీడియాలో ఓ అభిమాని మీద వాడితే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అది ఒక బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. నిర్దయగా, చాలా దారుణంగా ఆ సెలబ్రిటీని ట్రోల్ చేస్తూ దూషిస్తారు. కానీ అదే పదం ఒక మామూలు మనిషి ఒక సెలబ్రిటీ మీద వాడితే వాళ్లు మాత్రం ఎట్టి పరిస్థితులలో ఎవరూ స్పందించరు, సెలబ్రిటీలు కూడా మనుష్యులే, వారికి భావోద్వేగాలు ఉండకూడదా?" అంటూ బాధపడ్డారు. 
 
మీ సోషల్ మీడియాలో డైలీ ఎవరో ఒకరు ఏదో రకంగా దూషిస్తూ మీపై పోస్టులు పెడుతూ ఉంటే వాటిని చదివేటప్పుడు మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. రైతులకు సహాయపడాలనే నా ప్రయత్నాన్ని దూషించడం అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.