గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్ దళవాయి
Last Modified: మంగళవారం, 12 మార్చి 2019 (19:12 IST)

అమ్మాయిలతో మాట్లాడేందుకు నీలాంటి వాళ్లకు ఇదొక మార్గం... యాంకర్ రష్మి ఫైర్

ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గానే ఉంటారు. ఆమెకు నెటిజన్ల నుండి కామెంట్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. అందులో ఆమెకు అనుకూలంగా ఉండేవి, అలాగే విమర్శిస్తూ ఉండేవి కూడా ఉంటాయి. అలాగే అప్పుడప్పుడూ కొందరు ఆకతాయిలు కామెంట్లతో ఆమెను వేధిస్తూ ఉంటారు.
 
తాజాగా రష్మీకి ఒక ఆకతాయి నుండి మెసేజ్ వచ్చింది. అందులో మెసేజ్ పంపిన వ్యక్తి రష్మీ నంబర్ కాకుండా వాళ్ల నాన్న నంబర్ కావాలని అడిగాడు. ఒక యాడ్ షూటింగ్ కోసం మిమ్మల్ని సంప్రదించాలని, మీ నాన్న నంబర్ మిస్ అయిందని ఏమీ అనుకోకుంటే మీ నాన్న నంబర్ పంపుతారా అని మెసేజ్ పెట్టాడు. అతని ట్విట్టర్ ఖాతాకు అనుమానం రాకుండా ప్రొఫెషనల్‌గా ఉండేలా పిఆర్ మేనేజ్‌మెంట్ అని పేరు పెట్టుకున్నాడు.
 
ఆ ట్విట్టర్ మెసేజ్ చూసిన రష్మీ షాక్‌కు గురయ్యారు. కారణం రష్మి తండ్రి తన చిన్నతనంలోనే చనిపోయాడు. అతని మెసేజ్‌కు రష్మీ రిప్లై ఇస్తూ 'తన తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడని, అలాంటప్పుడు ఆయన నంబర్ నీ దగ్గర ఎలా ఉంటుంది, ఇలా పిఆర్ మేనేజ్‌మెంట్ పేరుతో మోసం చేయద్దని, అమ్మాయిలతో మాట్లాడేందుకు నీలాంటి వాళ్లకు ఇదొక మార్గం అని తనకు తెలుసని, మీలాంటి వ్యక్తుల వల్లనే ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోందని' స్పందించారు. రష్మీ ఇచ్చిన రిప్లైకి పలువురు నెటిజన్ల నుండి ఆమెకు మద్దతు వస్తోంది.