కరీనా కపూర్‌న్ ట్రోల్ చేసిన నెటిజన్లు.. ఆంటీనా? ఆ కామెంట్లేంటి?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కరీనా కపూర్ డ్రెస్సింగ్‌పై కామెంట్స్ చేస్తూ నెటిజన్లు ట్రోల్ చేయడం మీడియాలో చర్చకు దారితీసింది. తనపై వచ్చిన ట్రోలింగ్‌పై కరీనా ఆందోళన వ్యక్తం చేశారు. కరీనా ఆంటీ.. ''నీ వయసుకు తగిన డ్రస్సులు వేసుకో'' అంటూ నెటిజన్లు చేసిన కామెంట్లపై ఆమె స్పందించారు.
సెలబ్రిటీలంటే ప్రజలకు చులకనభావం ఏర్పడిందని కరీనా వ్యాఖ్యానించింది. తమ భావోద్వేగాలను వారు ఏమాత్రం పట్టించుకోవట్లేదని.. సెలెబ్రిటీలకు, హీరోహీరోయిన్లకు ఫీలింగ్స్ వుండవా? అంటూ ప్రశ్నించారు. ప్రజలు ఏమన్నా భరించాల్సిందే. మా మనోభావాలను ఎవరూ పట్టించుకోరూ అంటూ కరీనా ఆవేదన వ్యక్తం చేశారు.
నటులపై ప్రజలకు గౌరవం పోయిందని కరీనా కపూర్ గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు. పాతతరం నటులంటే ప్రజలకు గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.