శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : శనివారం, 2 మార్చి 2019 (16:48 IST)

వెళ్తే రాహుల్ గాంధీతోనే డేటింగ్‌కు వెళ్తా.. కరీనా కపూర్

బాలీవుడ్‌ హీరో రణ‌దీర్ కపూర్ కుమార్తెలు.. ప్రస్తుత హీరోయిన్లు కరీనా కపూర్, కరిష్మా కపూర్లు. కరీనా బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతుంది. పెళ్లయ్యాక కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుని రాణిస్తోంది. ప్రస్తుతం కరీనా కపూర్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరీనా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు కరీనా మనసులోని మాటను బయటపెట్టింది. మీరు ఎవరితో డేటింగ్ వెళ్లాలనుకుంటున్నారనే ప్రశ్నకు కరీనా ధీటుగా బదులిచ్చింది. టక్కున కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పేరు చెప్పేసింది.
 
తాను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చో లేదో తెలియదు కానీ చెబుతాను అంటూ రాహుల్ పేరు చెప్పింది కరీనా. అతడి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుందని.. తాను పూర్తిగా సినీ కుటుంబం నుంచి వచ్చాను. రాజకీయ కుటుంబానికి చెందిన రాహుల్‌తో చర్చ ఆసక్తికరంగా వుంటుందేమోనని వెల్లడించింది.
 
కాగా కరీనా ప్రస్తుతం చేతినిండా సినిమా ఛాన్సులతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌తో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాకు కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యం వహిస్తోంది.

అలాగే తక్త్ అనే పీరియాడిక్ డ్రామాలోనూ కరీనా నటిస్తోంది. ఈ చిత్రం 2020లో రిలీజయ్యే అవకాశం వుంది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, అలియా భట్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్, అనిల్ కపూర్, భూమీ పడ్నేకర్ నటిస్తున్నారు.