సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 1 మార్చి 2019 (20:38 IST)

ఇస్మార్ట్ శంక‌ర్ ఏం చేస్తున్నాడు..?

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. శ్రీమ‌తి లావ‌ణ్య స‌మ‌ర్ప‌ణ‌లో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోల‌ను మాస్ యాంగిల్‌లో స‌రికొత్త‌గా ప్రెజంట్ చేసే డైరెక్ట‌ర్ పూరి.. రామ్‌ను కూడా స‌రికొత్త లుక్‌లో చూపిస్తున్నారు. ఇప్ప‌టికే రామ్ లుక్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. 
 
ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేష్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. 30 రోజుల పాటు హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న భారీ షెడ్యూల్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం త‌దుప‌రి షెడ్యూల్ కోసం టోట‌ల్ యూనిట్ గోవా వెళుతుంది. అక్క‌డ మ‌రో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు డైరెక్ట‌ర్ పూరి.  హైద‌రాబాద్‌లో భారీ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీక‌రించారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.