సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: శుక్రవారం, 1 మార్చి 2019 (14:18 IST)

భారీ భద్రత మధ్య భారత్‌కు అభినందన్... పాక్ అలా చేసింది...

నిన్న పాకిస్థాన్ పార్లమెంటులో అభినందన్‌ను అప్పగిస్తామని ప్రకటించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దిశగా లాంఛనాలను పూర్తి చేయమని ఉన్నతాధికారులకు ఆదేశించారు. అయితే ఈ అప్పగింత ప్రక్రియను ప్రారంభించిన పాక్ ఉన్నతాధికారులు మొదట అభినందన్‌ను రెడ్‌క్రాస్‌కు అప్పగిస్తారని అందరూ భావించారు.
 
అయితే ఈరోజు అతని విడుదలకు సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేసి అభినందన్‌ను ఇస్లామాబాద్‌లోని భారత హైకమీషన్‌కు అప్పగించారు. మరికొద్ది సేపట్లో అభినందన్‌ను భారత అధికారులు స్వదేశానికి తీసుకురానున్నారు. 
 
ఈరోజు మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్యలో అట్టారీ-వాఘా జాయింట్ చెక్‌పోస్ట్ మీదుగా అభినందన్ అడుగు పెట్టబోతున్నాడు. అయితే ఇప్పటికే వాఘా సరిహద్దుకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలి వస్తుండటంతో అక్కడ భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసారు.