నమితా బొట్టు చిత్రం విడుదల తేదీ ఖరారు..!

Namitha
Last Updated: శుక్రవారం, 1 మార్చి 2019 (15:35 IST)
వడివుడయాన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బొట్టు. ఈ చిత్రంలో నమిత, ప్రేమిస్తే ఫేమ్ భరత్, ఇనియా, ఊర్వశి, షకీలా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్.‌ఎస్. సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై జి.కుమార్ బాబు 'బొట్టు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చేయనున్నారు.

ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ... బొట్టు అనే పేరు గల ఓ యువతి కథే ఈ సినిమా. కాంచన, గంగ వంటి చిత్రాల తరహాలో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో వస్తున్న మరో హారర్ కామెడీ యాక్షన్ చిత్రమిది. కథాకథనాలు ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. 52 నిమిషాల గ్రాఫిక్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సెన్సార్ ఇబ్బందుల వలన కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల నిలిచిపోయింది.

చివరికి రివైజింగ్ కమిటీ ద్వారా విడుదలకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా తెలుకు ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకం ఉంది. మరి సినిమా రిలీజ్ తరువాత ఎలా ఉంటుందో వేచి చూడాలి.దీనిపై మరింత చదవండి :